పాలస్తినాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుని దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు మహముద్ ఖాన్ మాట్లాడుతూ పాలస్తిన దేశంలో శాంతి నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రహమాన్, అశోక్ గణపతి, నరసింహులు, సాయిబాబా పాల్గొన్నారు.