సంగారెడ్డి: కలెక్టరేట్ ముందు సిఐటీయూ ధర్నా

56பார்த்தது
ఈఎస్ఐలో పనిచేసే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ, మూడు నెలలకు పైగా వేతనాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி