సంగారెడ్డి: మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు వైశ్యులకు గర్వకారణం

72பார்த்தது
హైదరాబాదులో భారీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.