సైబర్ బాధితులకి 12. 5 లక్షల రూపాయలు ఇచ్చేలా పోలీసులు చర్యలు తీసుకున్నారని ఎస్పీ రూపేష్ తెలిపారు. హత్నూరకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నవీన్ రెండు సంవత్సరాల క్రితం ఆన్ లైన్ లో ఓ వ్యక్తికి పరిచయమయ్యాడు. 30 లక్షల రూపాయలు జమచేసి మోసపోయానని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 12. 5 లక్షలను పోలీసులు హోల్డ్ చేశారు. దాన్ని బాధితుని అకౌంట్లోకి రిఫండ్ చేయించినట్లు తెలిపారు.