చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మెరుగైన బోధన అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయి, అధ్యాపకులు పాల్గొన్నారు.