పటాన్చెరు డీఎస్పీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ ఆవరణ పరిశుభ్రత, కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను చెక్ చేస్తూ. తగు సలహాలు సూచనలు చేశారు. డౌరీ డెత్, ఎస్సి, ఎస్టీ వంటి సున్నిత కేసులను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నూతన చట్టాల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.