సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభుమందిర్ హనుమాన్ దేవాలయంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. దుండగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.