సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామంలో ఆర్ అండ్ బి అధికారులు శుక్రవారం రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు కంకర క్రషర్ల వల్ల ధ్వంసమైన విషయం విధితమే. సమస్య పరిష్కారం కోసం మాదారం మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, ఆర్ అండ్ బి అధికారులు క్రషర్ల యజమానులతో చర్చించి రోడ్డుకు కావలసిన నిధులను సమకూర్చారు. మాదారం నుండి రింగ్ రోడ్ వరకు పనులు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.