పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా నూతన రహదారుల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణానికి 20 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.