సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు పారిశుద్ధ్య కార్మికుడు నరసింహ మృతి చెందిన సంఘటన విధితమే. మంగళవారం ఉదయం బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అయన డిమాండ్ చేశారు.