సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని బొల్లారం, జంగంపేట్, మంగంపేట, వావిలాల, సులక్పల్లి, ఓట్ల రాళ్లకట్ల, శివనగర్ తదితర గ్రామాలలో మంగళవారం ఉదయం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 82% గా ఉంది. విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు హెడ్ లైట్స్ వేసి మరి వాహనాలను నడిపారు. చలి పెరగడంతో జనాలు బయట కాలు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు.