సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు ప్రవీణ్ మాట్లాడుతూ 110 కుటుంబాలను తనకు కేటాయించడం జరిగిందని తెలిపారు. వివరాలు నమోదు చేసేటప్పుడు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుందని తెలిపారు. సర్వేకు గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.