తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. కొమురం భీం జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో కొమరంభీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.