రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మనూరు లోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.