వ్యాధుల నియంత్రణలో ల్యాబ్ టెక్నీషియన్‌ల పాత్ర కీలకమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి అన్నారు. సంగారెడ్డి లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు సాంకేతికను అందుపుచ్చుకోవాలని చెప్పారు. టీబీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.