సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రానికి చెందిన కుమారి సర్మ అఖిల, రాంరెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించింది. దాంతో మంగళవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అభినందించి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విద్య కుసుమాలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.