నారాయణఖేడ్ పట్టణం మంగళపేట కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేలు ఆర్డీవో కల్యాణ చక్రవర్తి శుక్రవారం పరిశీలించారు. వార్డును పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్ వివేకానంద్ పాల్గొన్నారు.