సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 నిమిషాల వరకు నేరుగా ప్రజల నుంచే వినతి పత్రాలు స్వీకరిస్తామని ఆదివారం చెప్పారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.