నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల పరిధిలోని జుక్కల్ గ్రామంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, ఐకేపీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.