వసతి గృహ అధికారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ను మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనం వేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జావిద్, కార్యదర్శి రవి పాల్గొన్నారు.