నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టులో శనివారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఛైర్మెన్, మెట్టు సాయికుమార్ చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ ల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.