చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నారాయణఖేడ్ జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పేర్కొన్నారు. సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు చేయడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉండి, నేరాలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భోజిరెడ్డి, మారుతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.