నారాయణఖేడ్ మండలం కొండాపూర్ కు చెందిన పాతులోతు సాలిభాయి రెండు దశాబ్దాల సమస్యను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిష్కరించారు. భర్త చావుల్యా నాయక్ తో కలిసి సాలిభాయి గ్రామ శివారులో 1. 35 ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంది. ఆమెకు కేవలం 0. 35 ఎకరాల భూమి రికార్డులో చేర్చారు. 20 ఏళ్లుగా పరిష్కారం కోసం తిరగా, ఫిబ్రవరి 27న చేసిన దరఖాస్తుకు కలెక్టర్ స్పందించి 1. 35 ఎకరాలకు పాసుబుక్కు అందజేశారు.