సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తుర్కవడగావ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక సామాజిక సర్వే కార్యక్రమాన్ని ఎంపీడీఓ సత్తయ్య సందర్శించారు. బుధవారం పలు వార్డుల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 9వ తేదీ నుంచి అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని ఆయన తెలిపారు.