సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఇంటింటికీ పర్యటించి సమగ్ర కుటుంబ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఎంపిడిఓ సత్తయ్య తెలిపారు. కంగ్టిలో ఎన్యుమరేటర్ల కు, సర్వే ప్రక్రియ నిర్వహణపై గురువారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ సర్వేలో పేర్కొన్న 54 అంశాల నిర్దేశిత లక్ష్యం ప్రకారంగా పకడ్పందీగా సర్వే వివరాలు నమోదు చేయాలని సూచించారు.