ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పోస్ట్ ఆఫీసులో పోస్టల్ పేమెంట్ అకౌంట్ తీసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిడి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు పోస్టల్ పేమెంట్ అకౌంట్ తెరిపించేలా చూడాలని సూచించారు.