సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణీ పాండురంగ ఆలయాన్ని ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతారం పీఠాధిపతులు శ్రీ జ్ఞానేశ్వర్ బాలరాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈనెల 25వ తేదీ శిఖరరస్థాపన, 26న గరుడవాహనం, 27న మహాపూజ, 28న గోపాల కాల్వలు, 29వ తేదీన రథోత్సవము జరుగును.