కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఇప్పటి నుంచి కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.