సింగూర్ మధ్య తరహా ప్రాజెక్టులో సోమవారం స్వల్పంగా వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు 11వ క్రస్ట్ గేట్ 2 మీటర్ల ఎత్తులో ఓపెన్ చేసి దిగువకు జలాలు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏ ఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 7263 క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. క్రస్ట్ గేట్ ద్వారా 10, 734 క్యూసెక్కులు, జెన్కో 2823, మొత్తం 13, 557 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందని తెలిపారు.