సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయశాఖ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఆలయ కార్యనిర్వహణాధికారి శివారుద్రప్ప సమక్షంలో ఆలయ పూజారులు లెక్కించారు. నాలుగు నెలల 12 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని ఎండోమెంట్ అధికారులు ఆలయ హుండీని లెక్కించగా రూ. 3 లక్షల , 54, 388 రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి శివారుద్రప్ప తెలిపారు.