మూడు ఇసుక లారీలను పట్టుకున్న రాయికోడ్ పోలీసులు

4709பார்த்தது
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామ ప్రధాన రోడ్డు మార్గంలో స్థానిక పోలీసులు రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న మూడు ఇసుక లారీలను రాయికోడ్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతమైన బీర్కూర్ నుండి కర్ణాటక రాష్ట్రం అయిన బిదర్ కు వేబిల్స్ మరియు సరైన ధ్రువపత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న. TS 04 UB 8599, TS 15 UD 0182, TS 12 UD 0584 నెంబర్లు గల ఇసుక లారీలను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ ఐ ఏడుకొండలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి సాధారణ తనిఖీల్లో చిమ్నాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వే బిల్లు లేకుండా లారీ సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ముగ్గరు లారీలపై డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి పక్క రాష్ట్రం అయిన కర్ణాటక బిదర్ కు రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ఇసుక లారీలు వేబిల్స్ లేకుండా జీరో గా ఇసుక రవాణాను కోనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారులు ముడుపుల మాయలో తమ పరిదీలను దాటిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటుంన్నాయి. నిఘావిభగ అధికారులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణ పై దృష్టిసారించాలని కొంతమంది ప్రజలు కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி