విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, అగ్నికి ఆహుతి అయిన చెరుకు పంట.

4297பார்த்தது
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, అగ్నికి ఆహుతి అయిన చెరుకు పంట.
దీపావళి పండుగ వేళా విద్యుత్తు అధికారులు ఓ రైతుకు భారీ నజరాణను కానుకగా అందించారు. దీపావళి పండుగ మంటలు అంటే ఎలా ఉంటాయో వారి నిర్లక్ష్యంతో అన్నదాతకు చుక్కలు చూపించారు. రైతు పండించిన పంటను బూడిదపాలు చేసి రైతు ఇంటి విషాదాన్ని నింపారు. ఈ సంఘటన నల్లంపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రైతు రాజ్ కుమార్ తనకున్న రెండున్నర ఎకరాల్లో కాయకష్టం చేసి ఆరుగాలం శ్రేమించి పండించిన చెరుకు పంటకు ఎవరో నిప్పు పెట్టినట్టుగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యింది. 32 కెవి విద్యుత్తు వైర్లు ఒకదానికి ఒకటి తగిలి మెరుపులు వచ్చి చెరుకు పంటకు అనడంతో పంటంత బుగ్గిపాలైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி