నారాయణఖేడ్ పట్టణంలో మహాత్మా గాంధీ, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టరెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని పి. కె. ఆర్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేయడానికి వచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేశారు.