సంగారెడ్డి జిల్లా వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అయి ఏడాదిన్నర అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కొల్లూరు లక్ష్మి శేషారెడ్డిని వట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆమె పేరును మంత్రి దామోదర రాజనర్సింహ ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.