జోగిపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ యువ నాయకులు జిన్నా విజయ్ కుమార్ రెండు కిలోల బంతిపూలను పండగ కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పండగ మహిళలకు ప్రత్యేకత అని అన్నారు. బతుకులను చల్లంగా చూసే అమ్మే బతుకమ్మ అని ఆయన అన్నారు.