ఎక్సైజ్ అధికారులపై ఫైర్

2602பார்த்தது
ఎక్సైజ్ అధికారులపై ఫైర్
రాయికోడ్ మండల కేంద్రంలో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా యువతకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోందని ఆందోల్ అసెంబ్లీ బిఎస్పీపార్టీ అధ్యక్షుడు పేర్కొన్నారు.
బెల్టు షాపుల నిర్వహకులపై బహుజన సమాజ్ పార్టీ ఆందోల్ అసెంబ్లీ అధ్యక్షుడు పిపడ్ పల్లి మోహన్ పలుమార్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. స్పందించిన దాఖలాలు లేవని అలాగే జహీరాబాద్ డివిజన్ పరిధికి చెందిన రాయికోడ్ మండలంలో ఉన్నటువంటి వైన్స్ లకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ వేసి రెండు నెలలు గడుస్తున్నా సంబంధిత ఎస్సై మరియు సీఐ నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని శుక్రవారం నాడు జహీరాబాద్ అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిని నియంత్రించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులోతుగుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్స్ నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుందని. మండల కేంద్రమైన రాయికోడ్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 8 నుంచి 15 బెల్టు షాపులు మండలంలో దాదాపుగా 150 నుండి 200 బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన మండిపడ్డారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you