ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డు సర్వే అందోల్ జోగిపేట పురపాలక సంఘం పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా 17వ వార్డును అధికారులు ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్ రెండు టీంలను ఏర్పాటు చేసి, నోడల్ ఆఫీసర్ గా ఆందోల్ జోగిపేట రెవెన్యూ డివిజన్ అధికారి పాండు ను నియమించారు. రెండు టీంలు శుక్రవారం 17వ వార్డులో కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఫ్యామిలీ డేటా బేస్ ఆధారంగా ఇంటింటి సర్వే జరిపారు.