సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో జిల్లా మూడో స్థానంలో నిలవడంలో అమీన్ పూర్ పోలీసుల పాత్ర కీలకమని మల్టీ జోన్-2 సత్యనారాయణ అన్నారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి పోలీసుల పని తీరు చాలా బాగుందని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.