సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండల పరిధిలోని జంబ్గి కె గ్రామానికి చెందిన దూదేకుల అప్సర్ అనారోగ్యానికి గురికాగా ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
అందుకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ల సాయంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 20 వెయిల రూపాయల చెక్కును మంగళవారం జంబ్గి కె గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ నాయకులు తిరుమల శ్రీకాంత్, ఉపసర్పంచ్ ఒగ్గు రమేష్ , గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బేలూరి రత్నారెడ్డి ల చేతుల మీదుగా దూదేకుల అప్సర్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాగభూషణం, విట్టల్ రెడ్డి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.