రాయికోడ్ లో క్రిస్మస్ పండుగ సంబరాలు

2954பார்த்தது
దేశ రాష్ట్రాల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపద్యంలోనే సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని మెతొడిస్ట్ చర్చిలో కాలనీ వాసులతో కలిసి పాస్టర్ రాజారావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వ్యాఖ్యలను బోధించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపించిన కేకును పాస్టర్ మరియు కాలనీ వాసులతో కలిసి కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటు కాలనీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కుల పెద్దలకు చారవణిలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. తదనంతరం మెథడిస్ట్ యూత్ సభ్యులు తెచ్చిన కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

స్థానిక పాస్టర్ రాజారావు మాట్లాడుతూ. ఈ రోజు క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసు జన్మించిన పవిత్ర రోజు, ఆయన పుట్టి దాదాపు రెండు వేల సంవత్సరాలు పూర్తయినా. ఇప్పటికీ కరుణాయముడైన యేసు పుట్టినరోజును ఎంతో మహత్తరమైన రోజుగా భావిస్తూ చర్చిలలో ప్రార్థనలు చేయడం జరుగుతుందని ఆ తర్వాత విందు, వినోదాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కాలనీ వాసులు ఊరేగింపు చేసుకుంటారని అన్నారు. అనేది ఆనవాయతీగా వస్తోందని అన్నారు. మండల ప్రజలపై దేవుడి కృప ఎల్లవేళలా ఉంటాయని విశ్వసిస్తూ. ప్రజలందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ పండుగ ఆనందలను, సంతోషాలను నింపాలని అలాగే మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాల్లో కాలనీ వాసులు పెద్దలు, చిన్నలు మహిళలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி