అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట, వట్పల్లి మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మక్తల్ జగన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎల్లంపల్లి సత్యనారాయణతో పాటు 16 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వట్ పల్లి మార్కెట్ చైర్మన్ గా కొప్పుల లక్ష్మి శేషారెడ్డి, వైస్ చైర్మన్ గా మన్నె ఈశ్వరయ్యతో పాటు 16 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.