హత్నూర ప్రభుత్వ ఆర్ ఐటిఏలో ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరంలో 172 సీట్లకు 132 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9963004960 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.