హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. ఫరూఖ్ నగర్ బసవన్న ఆలయంలో శివలింగం ధ్వంసం సంఘటనలో భజరంగ్ దళ్ పిలుపు మేరకు హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలు షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో శనివారం మానవహారం నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.