రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో సమావేశమయ్యారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డితో పాటు భూమి సునీల్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూసంస్కరణ చట్టం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణిలోని పార్ట్-ఎ, పార్ట్-బి లోని భూముల వివరాల గురించి చర్చించారు.