ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకువస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో అడ్వాన్డ్స్ పాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్(రోడ్లపై గోతు లు పూడ్చే యంత్రం)ను ఆయన ప్రారంభించారు. అనంతరం రోడ్డుపై గుంతలను సిబ్బందితో మూసివేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.