తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 1) స్మితా సభర్వాల్ ( 2001 బ్యాచ్ ) ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మితా సభర్వాల్ ను తెలంగాణ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగుతున్న ఎన్ శ్రీధర్ ను అక్కడి నుండి రిలీవ్ చేశారు.