హైదరాబాద్ నగరం మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. కొన్ని రోజులుగా మూసీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే ఈ సవాల్‌ను కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. దీనిలో భాగంగా నవంబర్ 16 రాత్రి నుంచి నవంబర్ 17 ఉదయం 9గంటల వరకూ బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు శనివారం ఆయన తెలిపారు.