ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను పోలీసులు విచారించారు. ఈ కేసులో హైదరాబాద్ నగరం ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ శనివారం విచారణకు హాజరయ్యారు. జైపాల్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తిరుపతన్నకు తాను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ అయ్యాయని వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు.