తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలో శనివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.