బీఆర్ఎస్కు నూకలు చెల్లాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, తాము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. శనివారం హైదరాబాద్ నగరం లో మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.